BODY

SITE MAINTED BY SARIKONDA SATISH(9885801006)


FLASH NEWS


PRTU FLASH NEWS-

. ..2019 ప్రమోషన్ స్థానాలు బదిలీలకు ఖాళీలుగా చూపించాలి -PRTU ప్రాతినిధ్యం.--

Thursday, May 2, 2013


ఉపాధ్యాయుల బదిలీల ఉత్తర్వులు GOMSNO 33&34 ----సంగ్రహ వివరాలు 

 బదిలీలకు ఎవరు అర్హులు: జూలై 1 -2013 నాటికీ రెండు సంవత్సరాలు సర్వీసు పాటశాలలో నిండిన వారు 

తప్పనిసరి బదిలీ ఎవరికీ : పాటశాలలో 8 సంవత్సరములు నిండినవారు ,రేషన లైజేషణ్ లో పోస్ట్ పోయినవారు,బాలికల ఉన్నత పాటశాలల్లో 50 సంవత్సరాలలోపు ఉన్న పురుష ఉపాధ్యాయులు,ప్రధానోపాధ్యాయులు ,SSC పబ్లిక్ పరీక్షలలో 10 శాతం కంటే తక్కువ ఉత్తీర్ణతా శాతం ఉన్న HM ,సంభందిత సబ్జక్ట్ ఉపాధ్యాయులు ,8 సంవత్సరములు నిండిన NCC ఉపాధ్యాయులు 

మినహాయింపు ఎవరికీ : రెండు సంవత్సరాలలోపు పదవీవిరమణ ఉన్న HM ,ఉపాధ్యాయులు 
(వారి ఆసక్తిని బట్టి ట్రాన్స్ఫర్ కావచ్చును  )

ఎంటైటిల్ మెంట్ పాయింట్స్ :
కాటగిరి I (20%HRA ) :1
కాటగిరి2 (14. 5%HRA ) :2
కాటగిరి 3 (12%HRA ) :3
కాటగిరి 4 (12%HRA &రవాణ సౌకర్యము లేని ప్రాంతాలు  ) :5

ప్రత్యేక  పాయింట్లు :రాష్ట్ర ,జిల్లా గుర్తింపు ఉన్న సంఘ బాధ్యులకు,అవివాహిత HM ,ఉపాధ్యాయినిలకు ,భార్యా భర్తలకు(8 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఉపయోగించుకోవలెను ) ,NCC యూనిట్ నిర్వహిస్తున్నపాటశాలలో 8 సంవత్సరములు నిండిన HM /ఉపాధ్యాయులకు 10 పాయింట్లు(8 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఉపయోగించుకోవలెను )
రేషన లై జేషన్  పాయింట్లు :8 సంవత్సరాలు పూర్తీ కాని వారికీ 10 పాయింట్లు లభించును 
ప్రతిభ ఆధారిత పాయింట్లు :రాష్ట్ర దేశ స్తాయి ఉత్తమ ఉపాధ్యాయులకు 10,15 పాయింట్లు . 
SPD గారిచే గుర్తింపు పొందిన వారికీ 10 పాయింట్లు . 
మైనస్ పాయింట్లు :SPD  గారి చే విధులలో నిర్లక్ష్యముగా వ్యవహరించారని గుర్తించబడిన వారికీ 10 పాయింట్లు తీసివేయబడును 
ప్రత్యెక కేటగిరీలు(8 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఉపయోగించుకోవలెను ):PH /OH /VC /HI . 
వితంతువులు 
విడాకులు పొందిన మహిళలు 
కాన్సర్ ,ఓపెన్ హార్ట్ సర్జరీ ,న్యురోసర్జరి బోన్ TB ,కిడ్నీ మార్పిడి వ్యాధులతో బాధపడుతున్నవారు 
MR సంతానం కలిగినవారు ,
గుండెలో రంధ్రాలు కలిగిన సంతానం ఉన్నవారు 
షుగర్ వ్యాధితో బాధపడుతున్న సంతానం కలిగినవారు 

ప్రత్యెక కాటగిరి క్రింద ఉండి రేష నలైజే షన్ కు గురి అయ్యే వారికీ 8 సంవత్సరాలు పూర్తి కానప్పటికీ మరల ప్రత్యెక కాటగిరి గా గుర్తింపబడు దురు . 
రిలీవింగ్ మరియు జాయినింగ్ :కౌన్సిలింగ్ పూర్తియిన మరుసటి రోజు నూతన స్థానం లో జాయిన్ కావలెను 

 షె డ్యు ల్ 
ఆన్ లైన్ దరఖాస్తు :                              3మే నుంచి 7 మే వరకు 
ప్రోవిసనల్ సినియరిటి లిస్టు :                  8 మే 
అభ్యంతరాలు :                                     9 మే 
ఫైనల్ సినియారిటి లిస్టు :                      10 మే 
కౌన్సిలింగ్ :                                         11 మే నుంచి 15 మే 

పోస్టుల ఖాళీలు: కౌన్సిలింగ్ నాటికీ క్లియర్ వేకెన్సీలు ,8సంవత్సరాలు పూర్తీ అయిన వారి స్థానాలు ,బాలికల పాటశాలల్లో పనిచేస్తున్న  50 సంవత్సరాలలోపు పురుష ఉపాధ్యాయుల స్థానాలు