🅰🅿
*♦ముచ్చటగా మూడోసారి ‘శ్లాస్', 4,6,9 తరగతుల విద్యార్థులకు పరీక్షలు*
*🔸26 నుంచి మూడు రోజులు నిర్వహణ*
*🔹పాఠశాల విద్యలో రెండు పర్యాయాలుగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మదింపు చేస్తున్న శ్లాస్ (ఎస్‌ఎల్‌ఏఎస్- స్టూడెంట్ లెర్నింగ్ ఎఛీవ్‌మెంట్ సర్వే) అధ్యయనం ఈ ఏడాది ముచ్చటగా మూడో సారి జరగనుంది.*
*🔸ఈ నెల 26వ తేదీ నుంచి మూడు రోజుల పాటు 4,6,9 తరగతుల విద్యార్థులను తెలుగు, ఆంగ్లం, గణితం సబ్జెక్టులపై పరీక్షించనున్నారు.*
*ఈ పరీక్షలు ఓఎంఆర్ విధానంలో ఉంటాయి.*
*🔹పాఠశాల విద్యాశాఖ, సెంటర్ ఫర్ సైన్సు అండ్ స్టూడెంట్ లెర్నింగ్ (సీఎస్‌ఎస్‌ఎల్), సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ (సీఎస్‌ఎఫ్), సమగ్ర సంస్థల సమన్వయంతో శ్లాస్ అధ్యయనం జరగనుంది.*
*🔸ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి మార్గదర్శకాలు జారీ చేశారు.*
*🔹రెండు అంశాల్లో విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి.*
*🔹మదింపు అంశాలను సీఎస్‌ఎస్‌ఎల్ సంస్థ సమకూర్చుతోంది.*
*🔸తెలుగు మాధ్యమం విద్యార్థులకు తెలుగు, ఆంగ్ల మాధ్యమం విద్యార్థులకు ఆంగ్లం సబ్జెక్టులపై ఒక పరీక్ష, గణితం, రెండు మాధ్యమాల విద్యార్థులకు కలిపి అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన మదింపు అంశాలతో మరొక రీక్ష ఉంటాయి.*
*🔹ఓఎంఆర్ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలు, జవాబులతో కూడిన ప్రశ్నా పత్రం ఉంటుంది. కంప్యూటర్లతో స్కానింగ్ చేయడం ద్వారా జవాబు పత్రాల మూల్యాంకనం చేస్తారు.*
*🔸తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు.*
*🔹రాష్ట్రంలో సుమారు లక్ష మంది విద్యార్థులను శ్లాస్ ద్వారా పరిశీలించనున్నారు.*
*🔸నాలుగో తరగతిలో 27 వేలు, ఆరో తరగతిలో 42 వేలు, తొమ్మిదో తరగతిలో 39 వేల మంది విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం, గణితం, అంతర్జాతీయ ఉపపరీక్షలు జరగనున్నాయి.*
*🔹సీఆర్పీల సేవలు.. శ్లాస్ పరీక్షల నిర్వహణకు సీఆర్పీల సేవలను వినియోగించనున్నారు.*
*పరీక్షల ఇన్విజిలేటర్లుగా, ప్రశ్నపత్రాల సరఫరాలో వీరి బాధ్యత కీలకం.*
*🔹ఈ మేరకు ఈ నెల 16 నాటికి సీఆర్పీల జాబితాను అందజేయాలని పాఠశాల విద్యాశాఖ జిల్లా యంత్రాంగానికి సూచించింది.*
*🔸ఎంపిక చేసిన సీఆర్పీలు నిర్దేశిత తేదీల్లో పరీక్షల సామగ్రి (ప్రశ్నా పత్రాలు, ఓఎంఆర్ పత్రాలు, విద్యార్థి, ఉపాధ్యాయ, ప్రధానోపాధ్యాయ ప్రశ్నా పత్రాలు)ని మండల విద్యా వనరుల కేంద్రం నుంచి పాఠశాలలకు తరలించి, పరీక్షల అనంతరం వాటిని తిరిగి ఎమ్మార్సీ వద్ద అప్పగించాల్సి ఉంది.*
*🥀పరీక్షల షెడ్యూలు ఇదీ*
*🔹శ్లాస్ పరీక్షలు ఈ నెల 26వ తేదీ నుంచి మార్చి ఒకటో తేదీ వరకూ ఉంటాయి. రోజు నాలుగు అంశాలపై పరీక్షలు జరుగుతాయి.*
*ఉదయం 9.45-11.30, 11.40-12.55,*
*మధ్యాహ్నం 1.45-3.30, 3.40-4.20*
*గంటల మధ్య పరీక్షలు ఉంటాయి. తెలుగు/ఆంగ్లం, గణితం పరీక్షలకు 105 నిమిషాలు, అంతర్జాతీయ మదింపు అంశాల పరీక్షకు 75 నిమిషాలు, విద్యార్థుల ప్రశ్నావళికి 40 నిమిషాలు సమయం కేటాయించారు.*
*🔸26న తొమ్మిది, 27న ఆరు, 28న నాలుగో తరగతికి పరీక్షలు జరుగుతాయి. మార్చి ఒకటిన ఉదయం నాలుగో తరగతి విద్యార్థులకు తరగతి ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థి ప్రశ్నావళి పరీక్ష ఉంటుంది*